ఘంటసాల కచేరోత్సవంలో ఎస్ వి రంగారావు జయంతోత్సవం
గాయక ఘంటసాల వారి 60 సంవత్సరాల కచేరి ఉత్సవంలో భాగంగా ఈనెల 3వ తేదీన విశ్వనట చక్రవర్తి యెస్ వి రంగారావు108వ జయంతిని నిర్వహస్తున్నట్లు ఘంటసాల కళాసమితి అధ్యక్ష కార్యదర్సులు ఘంటసాల కృష్ణ మోహన్, పోతన వెంకటేశ్వరరావు తెలిపారు.
ఘంటసాలలోని శ్రీ జలధీశ్వర స్వామి దేవాలయ ఆవరణలో జరుగు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ గాయకులు వి ఆర్ కె ఫణి, యస్ ఇందిర, ఘంటసాల వెంకటేశ్వరరావులచే గాన కచేరి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని వారు వివరించారు.
01 Jul 2026