చిట్వేలి మండల పరిధిలోని మైలిపల్లి పంచాయతీ ఎం.రాచపల్లి గ్రామంలోని (ఎం.పీపీ.ఎస్) పాఠశాల స్థలం చాలా దారుణంగా ముళ్ళకంపలకు నిలయంగా ఉందని, అలాగే పాములకు, తేళ్లకు, విషపురుగులకు, పాఠశాల నిలయంగా మారిందని. దీనివల్ల పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు ధైర్యం చేయలేకపోతున్నారని పాఠశాలకు వెంటనే హద్దులు ఏర్పాటు చేసి ప్రహరీ గోడ నిర్మించాలని మండల తాసిల్దార్ ఎస్.వి నరసింహారావు కు గురువారం ఎం.రాచపల్లి గ్రామ ప్రజలు, యువత అర్జీ ద్వారా సమర్పించడం జరిగింది.
ఈ విషయాన్ని పలుమార్లు ఇంతకు మునుపు ఉన్న తాసిల్దార్ కి, మరియు నియోజకవర్గ పెద్దలకు తెలియపరిచిన ఎటువంటి స్పందన లేదని తెలిపారు. పాఠశాల ఉనికిని కనుమరుగు కాకుండా పాఠశాల పరిధికి సంబంధించిన హద్దులను సర్వే చేసి పాఠశాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా ఎం.రాచపల్లి గ్రామ ప్రజలు, యువత ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం వెంటనే స్పందించిన చిట్వేలి మండల తాసిల్దార్ ఎస్.వి నరసింహారావు ఎం.రాచపల్లి పాఠశాలను పరిశీలించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ వెంటనే పాఠశాలకు హద్దులు ఏర్పాటు చేసి, ప్రహరీ గోడ నిర్మించాలని అధికారులను ఆయన కోరారు. తాసిల్దార్ కార్యాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో ఆయన చూపించిన చొరవ పై మండల వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి
ముఖ్యంగా తాసిల్దార్ విధులు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి సోమవారం కచ్చితంగా మండలానికి సంబంధించిన అధికారులు అందరూ ప్రజా సమస్యల పరిష్కార నివేదికకు హాజరవుతున్నారు పేదవాడు అర్జీ తీసుకువెళ్లిన తక్షణమే స్పందిస్తాడని ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ రామ్మోహన్, మండల సర్వేర్ త్యాగరాజు, వీఆర్వో ఉదయ్, విలేజ్ సర్వేర్ రామాంజనేయులు, పలువురు అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్ రామయ్య, ఎం.రాచపల్లి గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు