తిరువూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పర్వతం శ్రీనివాసరావు దంపతుల చిన్న కుమార్తె సాయి ప్రసన్న లక్ష్మి – గోపిచంద్ల నిశ్చితార్థ వేడుక గురువారం తిరువూరులోని వెంకటాచల దేవాలయం కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది.
ఈ శుభకార్యానికి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రముఖులు, పార్టీ పట్టణ అధ్యక్షులు మల్లెల శ్రీనివాసరావుతో పాటు కందిమళ్ళ శేషగిరిరావు, అబ్దుల్ హుస్సేన్, కిలారు శివరామకృష్ణ, ఆర్.ఆర్.కె. చారి, విశ్వనాధుని మాధవాచారి, ఎస్.ఎన్.బి. చారి, తాళ్లూరి అనీల్, పి. నిరంజన్, రామారావు, గుడిమెట్ల రాము, హుస్సేన్, ఆంజనేయులు, మూడు దుర్గారావు, భవాని తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సాగాలని ఆశీర్వదించారు. వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ నాయకుల సందడితో ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది.