వధూవరులను ఆశీర్వదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

తిరువూరు రూరల్ మండలంలోని చిక్కుళ్లగూడెం గ్రామానికి చెందిన పల్లెపాటి శ్రీనివాసరావు – శ్రీదేవి దంపతుల కుమార్తె రిషిత – హరికృష్ణల వివాహ వేడుక గురువారం ఘనంగా జరిగింది.

ఈ శుభకార్యానికి మాజీ ఎమ్మెల్యే, తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు యరమల రామచంద్రరెడ్డి, జిల్లా రైతు విభాగ కార్యదర్శి ముక్కామల సీతారామయ్య, మండల పార్టీ అధ్యక్షులు తాళ్లూరి నవీన్ కుమార్, జి. కొత్తూరు గ్రామ పార్టీ అధ్యక్షులు శీలం వెంకటరెడ్డి, వేమిరెడ్డి కృష్ణారెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అతిథుల సమక్షంలో వివాహ వేడుక ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.